Bus accident: కార్తిక పౌర్ణమి సందర్భంగా కడప డిపో నుంచి నిన్న తమిళనాడులోని అరుణాచలానికి ఆరు బస్సులు భక్తులతో వెళ్లాయి. అక్కడ దర్శనం ముగించుకుని తిరిగి రాత్రి కడపకు బయలుదేరగా అందులో ఓ బస్సు చిత్తూరు సమీపంలో ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం, రహదారిపై స్పీడ్ బ్రేకర్ ఉండడంతో బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులకు ఆర్టీసీ డ్రైవర్లను పంపాల్సి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకుండా కాంట్రాక్టు డ్రైవర్ను పంపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన వారికి ప్రథమ చికిత్స కూడా చేయించకుండా అదే బస్సులో కడపకు తీసుకొచ్చారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఇవీ చదవండి:
- శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. తల్లీకూతుళ్లపై హత్యాయత్నం
- ఇన్సూరెన్స్ కంపెనీకి టోకరా.. రూ.1.60 కోట్లు కాజేసిన మహిళ!
- T20 world Cup : అదిరే అదిరే.. పొట్టి కప్పు ఇచ్చిన థ్రిల్ అదిరే!