ETV Bharat / state

'కొత్త పద్ధతి వద్దు..పాత ఇసుక విధానమే ముద్దు' - sand policy

ఇసుక సరఫరాలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తమ పొట్ట కొడుతున్నాయని తిరుపతిలో భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం పాత పద్ధతిలో ఇసుకను సరఫరా చేసి తమను ఆదుకోవాలని డిమాండ్​ చేశారు.

కొత్త పద్ధతి వద్దు..పాత ఇసుక విధానమే ముద్దు
author img

By

Published : Sep 24, 2019, 1:08 PM IST

కొత్త పద్ధతి వద్దు..పాత ఇసుక విధానమే ముద్దు

ఇసుక సరఫరాలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ తిరుపతిలో భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేపట్టారు. కార్మికులకు మద్ధతుగా రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవళ్ల మురళి పాల్గొన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని భవన నిర్మాణ కార్మికులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మంచిది కాదని హితవు పలికారు. రోజువారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కార్మికులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరుపేదలైన కార్మికులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాత పద్ధతిలోనే ఇసుక సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

ఇది చదవండి:

పూజాతో డేటింగ్... పల్లవితో పెళ్లి: వరుణ్ ​తేజ్​

Intro:రెక్కాడితే కానీ డొక్కాడని భవన నిర్మాణ కార్మికుల పై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మంచిది కాదని రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవళ్ళ మురళి అన్నారు.

Body:రోజువారి కూలి పని చేసుకంటూ జీవనం సాగిస్తున్న భవన నిర్మాణ కార్మికుల పై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మంచిది కాదని రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవళ్ళ మురళి హితవు పలికారు. భవన నిర్మాణ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.. కూలీలు తిరుపతి లో ధర్నా చేపట్టారు. కార్మికులకు మద్దతుగా విచ్చేసిన దేవళ్ళ మురళి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరుపేదలైన భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉచితంగా పాత పద్ధతిలోనే ఇసుక సరఫరా చేయాలని డిమాండ్ చేశారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.