బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు. చిత్తూరు నగరంలోని బ్రాహ్మణ ఆత్మీయ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా.. ఆర్థికసాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, శంకర బ్రాహ్మణ సేవా సమితి నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : పింఛను ఇవ్వలేదని.. పంచాయతీ కార్యదర్శిపై మహిళ దాడి