చిత్తూరు జిల్లా గాజుల మండ్యం సమీపంలోని పిల్లపాళ్యం వద్ద స్వర్ణముఖి నదిలో 10 మంది విద్యార్థులు ఈతకు వెళ్లారు. అందులో నీట మునిగి అమరేశ్వర్ అనే బాలుడు మృత్యువాత పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వాగులో చిక్కుకున్న బాలుడిని గ్రామస్థుల సహాయంతో వెలికితీశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: ఒడి వదిలి వెళ్లిన బిడ్డకు గుడి.. ట్రస్ట్‌తో సాయం