ETV Bharat / state

BOY DEATH: వానర భయం... తీసింది ప్రాణం

వానర భయంతో ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. తిను బండారాలు తీసుకువస్తుండగా.. ఓ వానరం వాటిని ఎత్తుకెళ్లింది. దానిని అనుసరిస్తూ అతను మేడమీదకు వెళ్లాడు. అక్కడ కోతుల గుంపు మీదికి రావడంతో భయంతో పరిగెత్తబోయి మేడ మీద నుంచి ప్రమాదవశాత్తు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు.

boy died fall from the building in chitturu distrcict

author img

By

Published : Aug 3, 2021, 11:30 AM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో విషాదఘటన చోటుచేసుకోంది. వానర భయంతో ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

మండలంలోని పనబాకం గ్రామానికి చెందిన చంద్రబాబు, మమత ఇద్దరు కుమారులు. అందులో పెద్దకుమారుడు పునీత్ ఆరో తరగతి చదువుతున్నాడు. దుకాణానికి వెళ్లి తినుబండారాలు కొనుగోలు చేసి.. తిరిగి ఇంటికి వెళుతుండగా.. ఓ వానరం బాలుడి దగ్గరవున్న తినుబండారాలను లాక్కెళ్లింది. ఆ కోతిని అనుసరిస్తూ.. ఆ బాలుడు మేడపైకి వెళ్లాడు. అక్కడ ఉన్న వానర గుంపు ఒక్కసారిగా బాలుడి వైపు రావడంతో భయపడి కంగారులో పరిగెత్తబోయి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. స్పృహ కోల్పోయిన పునీత్​ను 108లో తిరుపతికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి: red sandal: చెన్నైలో చిత్తూరు పోలీసుల తనిఖీలు.. రూ.5 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.