రోజుకో వివాదాస్పద నిర్ణయంతో తితిదేపై ఒత్తిడి తెస్తున్న సీఎం వైఎస్ జగన్ ఆలోచనా తీరు మారేలా.. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి హితోపదేశం చేయాలని భాజపా యువమోర్ఛా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు కోరారు. పాలక మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. తిరుమల పవిత్రతను తగ్గిస్తున్నారని ఆరోపించారు.
శ్రీవారి లడ్డూలు బహిరంగ మార్కెట్లో పెట్టడం.. తితిదే నిరర్థక ఆస్తుల విక్రయం నిర్ణయాన్ని భాజపా తీవ్రంగా ఖండిస్తోందని తిరుపతిలో చెప్పారు. మంగళవారం నుంచి కరోనా ప్రోటాకాల్ పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై భాజపా ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:
'చేతులు జోడించి కోరుతున్నా.. తిరుమల శ్రీవారి జోలికి వెళ్లొద్దు'