ETV Bharat / state

హథీరాంజీ మఠం భూముల వ్యవహారంపై గవర్నర్​కు భాజపా ఫిర్యాదు - తిరుపతి హథీరాంజీ మఠం భూముల వ్యవహారం

తిరుపతి హథీరాంజీ మఠం భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును భాజపా నేతలు ఖండించారు. మఠం ఆస్తులకు కస్టోడియన్​గా దేవస్థానం వ్యక్తులను కాకుండా అధికారిని నియమించటాన్ని తప్పుబట్టారు. దీనిపై గవర్నర్​కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

bjp press meet on hathi ramji matam land issue at tirupati press club
హథీరాంజీ మఠం భూముల వ్యవహారంపై భాజపా నేతల మీడియా సమావేశం
author img

By

Published : Feb 2, 2020, 1:28 PM IST

హథీరాంజీ మఠం భూముల వ్యవహారంపై ప్రభుత్వ తీరు తప్పుబట్టిన భాజపా నేతలు

తిరుపతి హథీరాంజీ మఠం భూముల వ్యవహారంలో... రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై వ్యతిరేకంగా గవర్నర్​కు ఫిర్యాదు చేయనున్నట్లు భాజపా రాష్ట్ర కార్యదర్శి భాను ప్రకాష్ రెడ్డి ప్రకటించారు. తిరుపతి ప్రెస్​క్లబ్​లో సమావేశంలో మాట్లాడిన ఆయన.. వేలకోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. మఠం ఆస్తులకు కస్టోడియన్​గా దేవస్థానం వ్యక్తులను కాకుండా అధికారిని నియమించటాన్ని తప్పుబట్టారు. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన కోరారు. దేశ వ్యాప్తంగా హథీరాం మఠానికి ఉన్న ఆస్తులను లెక్కకట్టాలని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్​ డిమాండ్ చేశారు. హథీరాం మఠం వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు భాజపా నేతలు తెలిపారు.

ఇదీ చదవండి:

'భాజపాలో వారసత్వ రాజకీయాలకు తావులేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.