ETV Bharat / state

Sunil Devdar: జనసేనతో కలిసి పని చేస్తాం: సునీల్‌ దేవధర్‌ - వైకాపా ప్రభుత్వంపై ధ్వజమెత్తిన సునీల్​ దేవధర్​

Sunil devdar: జనసేనతో కలిసి పనిచేస్తామని సునీల్‌ దేవధర్‌ అన్నారు. వైకాపా హిందూ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు.

Sunil devdar
సునీల్‌ దేవధర్‌
author img

By

Published : Mar 16, 2022, 8:10 AM IST

Sunil devdar: వైకాపా ప్రభుత్వ రౌడీ, హిందూ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జనసేనతో కలసి పని చేస్తామని భాజపా జాతీయ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర సహ బాధ్యుడు సునీల్‌ దేవధర్‌ చిత్తూరులో తెలిపారు. భాజపా శక్తి సంఘాల బాధ్యుల సమావేశానికి హాజరైన ఆయన.. "కందిపప్పు కోసం కేంద్రం ఇచ్చిన రాయితీ తీసుకుని పేదలకు కందిపప్పును సక్రమంగా ఇవ్వని వైకాపా.. దాల్‌ చోర్‌ పార్టీ" అని విమర్శించారు.

గుంటూరులోని జిన్నా టవర్​ పేరు మార్చాలని తాము డిమాండ్ చేస్తున్నా.. వైకాపా పట్టించుకోలేదని సునీల్​ దేవధర్​ చెప్పారు. వైకాపా హిందూ వ్యతిరేక విధానాలను పాల్పడుతుందని ఆరోపించారు. రైతు సమస్యలపై ఈ నెల 19న కడపలో 'రాయలసీమ రణభేరి' సభ నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:

నాటుసారా మరణాలపై స్పందించిన ప్రభుత్వం.. సారా అక్రమ నిల్వదారులపై కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.