రాష్ట్రంలో 140 దేవాలయాలపై వరుస దాడులు జరిగినా దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి స్పందించలేదని... అలాంటి ఆయన తమ పార్టీపై విమర్శలు చేయటం విచిత్రంగా ఉందని భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఓ చర్చిపై దాడి జరిగితే తెల్లవారేసరికి 40 మందిని అదుపులోకి తీసుకున్నారు కానీ... ఆలయాల దాడులపై ఎందుకు స్పందించరని ప్రశ్నించారు.
బాధ్యాతాయుతమైన పదవిలో ఉంటూ భాజపా నేతలను... అసభ్యకర పదజాలంతో దూషించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. భాజపీ నేతలు గాడిదలు కాస్తుంటే... ఆలయాలపై దాడులు జరుగుతున్న సమయంలో.. ప్రభుత్వ పరంగా మీరేమి చేశారని మంత్రిని విమర్శించారు. హిందువుల మవోభావాలు గాయపడేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: