వైకుంఠ ఏకాదశి రోజు నుంచి పదిరోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని తితిదే నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల భాజాపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తద్వారా ఎక్కువ సంఖ్యలో సాధారణ భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కలుగుతుందన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భాను ఈ అంశంపై స్పందించారు. మఠాధిపతులు, పీఠాధిపతులను సంప్రదించి తితిదే మంచి నిర్ణయం తీసుకుందన్నారు.
ఇదీ చూడండి: