ETV Bharat / state

somu veerraju: ఈనెల 17 నుంచి 'సేవ - సమర్పణ': సోము వీర్రాజు - ప్రధాని మోదీ జన్మదినం

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా 'సేవ-సమర్పణ' కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 7 వరకు ఈ కార్యక్రమాలు జరపనున్నట్లు తిరుపతిలో ఆయన వెల్లడించారు.

"Service-Samarpana" from the 17th of this month -Somu Veerraju
ఈనెల 17 నుంచి "సేవ-సమర్పణ" -సోము వీర్రాజు
author img

By

Published : Sep 15, 2021, 2:07 PM IST

ఈనెల 17 నుంచి అక్టోబర్ 7 వరకు 'సేవ-సమర్పణ' పేరుతో వివిధ ప్రజా ఉపయోగ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేపట్టనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. సెప్టెంబరు 17న ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తిరుపతిలో ఆయన తెలిపారు. ఈ నెల 17న దేశవ్యాప్తంగా 2 కోట్ల మందికి కరోనా వ్యాక్సినేషన్‌ నిర్వహించనున్నామన్నారు. ఈ నెల 18న ఉచిత రేషన్, ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టనున్నట్లు వివరించారు. ప్రపంచ దేశాలకు ధీటుగా కరోనా వ్యాక్సిన్ తయారు చేసినందుకు ప్రధానిని అభినందిస్తూ 23, 24 తేదీల్లో 5 కోట్ల పోస్టు కార్డులు పోస్ట్ చేయనున్నట్లు తెలిపారు.

తితిదే పాలకమండలిలో సంఖ్యకు మించి సభ్యులను నియామిస్తే ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.

ఇదీ చదవండి : TTD: నేడు తితిదే పాలకమండలి ప్రకటన !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.