చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో తెదెేపా నేతలపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని కేసులు నమోదు చేసిన పోలీసులు తహశీల్దారు వద్ద బైండోవర్ చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కొవిడ్ నిబంధనలు అతిక్రమించేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోయినా తమపై కేసులు నమోదు చేస్తున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీలపై దాడులను నిరసిస్తూ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి అధికారులకు వినతిపత్రం ఇవ్వడమే తాము చేసిన నేరమా అని తెదేపా నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి