కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన ఓ రైతు అరటి సాగు చేశాడు. ఈ ఏడాది దిగుబడి అధికంగా రాగా.. కరోనా లాక్డౌన్ కారణంగా వాటిని విక్రయించకోలేకపోయానని ఆవేదన చెందాడు. తన పరిస్థితిని సామాజిక మాధ్యమాల్లో విన్నవించుకున్నాడు. రైతు పరిస్థితిని గమనించిన మదనపల్లికి చెందిన విజయభారతి పాఠశాల కరస్పాండెంట్ సేతు.. ఆ పంటను కొనుగోలు చేశాడు. వీటని పట్టణంలోని పేదలకు ఉచితంగా పంపిణీ చేశారు. తాను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినని, రైతు ఆవేదన చూసి పంట కొనుగోలు చేశానని సేతు తెలిపారు. ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న అన్నదాతలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
ఇదీచదవండి.