చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని 6 మండలాల్లో ఉన్న 50 వేల కుటుంబాలకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. వాలంటీర్లు, ఎంపీడీవోల ద్వారా నిత్యావసరాలు, పండ్లు అందజేస్తున్నామన్నారు. ఎవరూ ఇళ్లనుంచి బయటకు రావొద్దని కోరారు.
ఇవీ చదవండి.. ఆటో కార్మికులకు కూరగాయలు పంపిణీ చేసిన ఎస్ఐ