పశ్చిమ గోదావరి జిల్లా కరోనా వైరస్ ప్రభావంతో లాక్డౌన్ అమలులో ఉండటంతో మూడు చక్రాలు తిరగక ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్ల పట్ల ఉండ్రాజవరం ఎస్ఐ అవినాష్ తన వితరణ చాటుకున్నారు. మండలంలోని సుమారు 400 మంది ఆటో కార్మికులకు కూరగాయలను పంపిణీ చేశారు. తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.ఎస్. చైతన్యకృష్ణ పంపిణీ ప్రారంభించారు. ఎస్సై అవినాష్ ఆటో కార్మికుల పట్ల చూపిన వితరణకు సిఐ చైతన్య కృష్ణ ఇతర ఉన్నతాధికారులు అభినందించారు. మానవతా దృక్పథంతో ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తన వంతు సాయం అందించానని ఎస్సై అవినాష్ తెలిపారు.
ఇది చదవండి ఉపాధి హామీ పని పేరుతో వైకాపా నేత తోటలో పనులు