ETV Bharat / state

ఇంట్లోనే సినిమా హాల్​ - మధ్య తరగతికి అందుబాటు ధరల్లోనే - HOME THEATER CINEMATIC SOUND

మారిపోతున్న అభిరుచులు - రూ.50 వేల నుంచి రూ. 30 లక్షల మధ్య లభిస్తున్న హోం థియేటర్లు

home_theater_systems_with_cinematic_surround_sound
home_theater_systems_with_cinematic_surround_sound (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 18, 2024, 9:49 AM IST

Home Theater Systems With Cinematic Surround Sound : సినిమా చూడాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే ఇది ఒకప్పటి మాట. ఇంట్లోని టీవీలో చూద్దామంటే హాల్‌లోని దృశ్య, శబ్ద నాణ్యత, సంగీతం ఉండేవి కావు. పోనీ హోం థియేటర్‌ కొందామంటే రూ.లక్షల్లో ఖర్చు, అది ధనవంతులకే అని సరిపెట్టుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. హోం థియేటర్‌ మధ్యతరగతి ఇళ్లలో సైతం వాలిపోతోంది. పదుల కొద్దీ ఓటీటీలు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు లక్షలకొద్దీ యూట్యూబ్‌ వీడియోలతో కొత్తలోకం చూపిస్తోంది.

ఇవే కాకుండా పెళ్లిళ్లు, ప్రీ వెడ్డింగ్‌ షూట్లు, ఇతర కార్యక్రమాల వీడియోలను హోం థియేటర్‌లో చూస్తేనే వంద శాతం సంతృప్తి అనేలా అభిరుచులు మారిపోతున్నాయి. టీవీలు, హోం థియేటర్లలో తెర, సాంకేతికతకు అనుగుణంగా ధరలు రూ.50 వేల నుంచి మొదలవుతున్నాయి. చిత్రంలో, శబ్దంలో నాణ్యత కోసం గదిలో ఏర్పాటు చేసే ఆధునిక సౌకర్యాలకు అనుగుణంగా ఈ ధర రూ. లక్ష, రూ.5 లక్షలు, రూ.30 లక్షలు ఎంతైనా ఇక మీ ఇష్టం.

కోరుకున్న సాంకేతికత : హోం థియేటర్‌ అంటే రూ.లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అలాగని చిత్ర, శబ్ద నాణ్యతలో రాజీ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. 4కే, అల్ట్రాహెచ్‌డీ, క్యూఎల్‌ఈడీ టీవీలు, డాల్బీ అట్మాస్, డీటీఎస్‌ ఎక్స్‌ శబ్ద సాంకేతికతతో వస్తున్నాయి. పలు కంపెనీల ఉత్పత్తులు నాణ్యతలో అంతర్జాతీయ బ్రాండ్లకు పోటీనిస్తున్నాయి. దీంతో బడా బ్రాండ్లు సైతం దిగొచ్చి సామాన్యుడి ఇంటి తలుపు తడుతున్నాయి. 65 అంగుళాల యూహెచ్‌డీ, క్యూఎల్‌ఈడీ టీవీలు రూ.35 వేల నుంచి లభిస్తున్నాయి. సౌండ్‌ సిస్టమ్‌కు రూ.15 వేలు పెడితే చాలు ఇంట్లోనే హోం థియేటర్‌ సిద్ధం. ప్రముఖ కంపెనీలకు చెందినవైతే ధర కాస్త ఎక్కువ ఉంటుంది. ఓఎల్‌ఈడీ (OLED), క్యూఎల్‌ఈడీ (QLEd), మినీ ఎల్‌ఈడీ టీవీలకు రూ.లక్షపైనే ఖర్చు పెట్టాలి. తెర పరిమాణం పెరిగేకొద్దీ ధరలు పెరుగుతాయి.

  • టీవీలకు సంబంధించి నిట్స్‌లో కాంతిని కొలుస్తారు. ప్రస్తుతం ఉన్న వాటిలో మినీ ఎల్‌ఈడీలు.. సూక్ష్మ ఎల్‌ఈడీ డయోడ్‌లతో తెరపై శక్తిమంతమైన, స్పష్టమైన రంగుల్ని అందిస్తాయి. నిట్స్‌ ఆధారంగా వాటి నాణ్యత, ధర ఉంటుంది.
  • సినిమా చూడాలన్నా.. పాటలు వినాలన్నా శబ్ద నాణ్యత ఎంతో ముఖ్యం. దీన్ని డాల్బీ అట్మాస్‌ టెక్నాలజీ అందిస్తుంది. 360 డిగ్రీల కోణంలో శబ్ద తరంగాల్ని వ్యాప్తిచెందేలా చేస్తుంది. ఓటీటీ ఛానెల్స్‌లో 4కే, 8కే రిజల్యూషన్‌తో వచ్చే వీడియోలు ఈ విధానాన్ని సపోర్టు చేసేలా ఉంటున్నాయి.
  • హోం థియేటర్‌లో ప్రొజెక్టర్‌ వ్యయమే అధికం. ఇందులో ఎలాంటి రంగు గోడపై ప్రదర్శించినా, ఎగుడు దిగుడుగా ఉన్నా.. అందుకు అనుగుణంగా చిత్రాన్ని సర్దుబాటు చేసుకునే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఇవి రూ.6 వేల నుంచి రూ.17 లక్షల వరకు ఉన్నాయి. ఫుల్‌ హెచ్‌డీ, 4కే, నేటివ్‌ 4కే, 8కే తదితర సాంకేతికతకు అనుగుణంగా ధరల శ్రేణి ఉంటుంది.

ఏ విభాగం ఎంత ధరలో అంటే : సాధారణ రకానివి రూ.50 వేలు వీటిలో 55 నుంచి 65 అంగుళాల మధ్య టీసీఎల్, తోషిబా, హయర్, హైసెన్స్, వూ, ఏసర్, ఎంఐ తదితర కంపెనీల 4కే యూహెచ్‌డీ టీవీలు సోనీ, యమహా, పానాసోనిక్, ఐకాల్, ఓబేజ్, జీబ్రానిక్స్, జేబీఎల్, క్రాస్‌బీట్స్, బోట్, ఫ్రాంటెక్, రీకనెక్ట్, ఇంటెక్స్‌ తదితర కంపెనీల సౌండ్‌ సిస్టమ్‌లు ఉన్నాయి.

  • మీడియం విభాగంలో రూ.50 వేల నుంచి రూ.లక్ష.. 65 అంగుళాల్లో సోనీ, ఎల్జీ, శ్యాంసంగ్, టీసీఎల్, హయర్, వూ, క్యాండీ, ఏసర్, ఇఫాల్కన్, హైసెన్స్, ఎంఐ తదితర కంపెనీల క్యూఎల్‌ఈడీ, క్రిస్టల్‌ యూహెచ్‌డీ, ఓఎల్‌ఈడీ టీవీలు.. యమహా, ఎల్జీ, సోనీ, మివి, జీబ్రానిక్స్, జేబీఎల్, బోట్, లాగిటెక్‌ తదితర కంపెనీల సౌండ్‌ సిస్టమ్‌ లభ్యమవుతున్నాయి.
  • ప్రీమియం విభాగంలో రూ.లక్ష నుంచి రూ.5 లక్షలు అవుతుంది. సోనీ, శ్యాంసంగ్, ఎల్జీ తదితర కంపెనీల 65 అంగుళాల ఓఎల్‌ఈడీ టీవీలు, ఇతర బ్రాండ్లలో 65 అంగుళాలపైన ఓఎల్‌ఈడీ, మినీ ఎల్‌ఈడీ టీవీలు, బోవర్స్‌-విల్‌కిన్స్, ఎలాక్, సోనీ, ఎల్జీ, బాస్, హార్మన్, గాలో, ఫోకల్, ఓంక్యో, జేబీఎల్‌ తదితర కంపెనీల సౌండ్‌ సిస్టమ్‌లు ఉన్నాయి.
  • లగ్జరీ విభాగంలో రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల పైన.. సోనీ, ఎల్జీ, శ్యాంసంగ్, టీసీఎల్, తోషిబా, హైసెన్స్‌ తదితర కంపెనీల 85 అంగుళాలు, ఆపైన మినీ ఎల్‌ఈడీ, క్రిస్టల్‌ 4కే యూహెచ్‌డీ, నియో క్యూఎల్‌ఈడీ 4కే, ఫుల్‌ ఎరే తదితర రకాల తెరలతో లభిస్తున్నాయి. డెనాన్, మరాంతజ్, మార్టిన్‌ లోగన్, బ్యాంగ్‌ లోఫ్‌సెన్, క్యూబ్, బోస్, యమహా, సోనీ, ఎల్జీ, పయనీర్, డెఫినిటివ్, బోయర్స్‌ వికిన్స్, బెన్‌క్యు, ప్లాటిన్‌ మొనాకో, బోస్, జేవీసీ, క్లిప్స్క్‌ తదితర కంపెనీల సౌండ్‌ సిస్టమ్స్‌లు అందుబాటులో ఉన్నాయి.

"ఆ నిద్రగన్నేరు మళ్లీ చిగురించింది - ఆకు తొడిగిన సినిమా చెట్టు"

సౌండ్‌ ప్రూఫింగ్‌తో : గది లోపల సౌండ్‌ బయటకు రాకుండా, బయట శబ్దాలు లోనికి రాకుండా నియంత్రించడానికి సౌండ్‌ ప్రూఫింగ్‌ ఉపయోగపడుతుంది. గాలిని బయటకు పోకుండా బంధించేదే సౌండ్‌ ప్రూఫింగ్‌. స్పీకర్‌ పెర్‌ఫార్మెన్స్‌ 100 శాతం ఎంజాయ్‌ చేయాలన్నా.. రిఫ్లెక్షన్స్‌ రాకుండా.. శబ్ద నాణ్యత పెరగాలన్నా అకాస్టిక్స్‌ ముఖ్యం. బడ్జెట్‌పై ఆధారపడి రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల బడ్జెట్‌లో థియేటర్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. మంచి అనుభూతి పొందాలంటే అదనపు స్పీకర్లు, విలాసవంత సీట్లు, గది అంతా కర్టయిన్లు, కార్పెట్లు, కస్టమైజ్డ్‌ లైటింగ్‌ చేయించుకోవచ్చు. గది విస్తీర్ణం, సీటింగ్‌ సామర్థ్యం మేరకు వ్యయం పెరుగుతుంది.

ఈ మూడూ ముఖ్యమే

  • ఆడియో, వీడియో సామర్థ్యం
  • వీక్షకుల అవసరాలు, ఇంటిలో ఉన్న వారి వయసు, వారి అభిరుచులకు అనుగుణంగా డిజైన్‌ చేయాలి.
  • హోం థియేటర్‌లో టీవీ, ప్రొజెక్టర్‌ ఒక్కటే చాలదు.. ఆడియో, వీడియో, అకాస్టిక్స్‌ (గదిలో సౌకర్యాలు) అన్నీ కలిపి బ్యాలెన్స్‌ చేయాలి.

శబ్ద నాణ్యత ముఖ్యం : కరోనా తర్వాత హోం థియేటర్లు ఏర్పాటు చేసుకునే వారు రెట్టింపయ్యిందని వ్యాపారం పెరిగిందని సంబంధిత వ్యాపారి కార్తిక్​ పేర్కొన్నారు. థియేటర్‌లో చూసినదానికంటే హోం థియేటర్లోనే మంచి సౌండ్‌ క్వాలిటీ ఉంటుందని ఆయన అంటున్నారు. సినిమాటిక్‌ అనుభూతి పొందవచ్చని, ఇందులో అధునాతన బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయని తెలుపుతున్నారు. ఒకసారి హోం థియేటర్‌ ఏర్పాటు చేసుకున్నాక పదేళ్ల వరకు వాడుకోవచ్చని అంటున్నారీయన.

ఇంటి నిర్మాణంతోపాటే హోం థియేటర్‌ : మొదట్లో సినీ, రాజకీయ ప్రముఖులే వీటిని ఏర్పాటు చేసుకునేవారని, ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల వారూ వీటిపై ఆసక్తి చూపుతున్నారని హైదరాబాద్​ వాసి జగదీశ్​ తెలుపుతున్నారు. ఇంటి నిర్మాణ ప్రణాళికలోనే దీనికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నామని పూజ గది మాదిరిగా హోం థియేటర్‌కూ ప్రాధాన్యమిస్తున్నామంటున్నారు.

ఇంట్లోనే నచ్చిన సినిమా : చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టమని, అందుకే హోం థియేటర్‌ను ఏర్పాటు చేసుకుని కుటుంబంతో కలిసి చూస్తున్నామని ఓ వ్యాపారవేత్త తెలుపుతున్నారు. ఏడాదికోసారి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకొని నచ్చిన సినిమా, వెబ్‌సిరీస్‌లు చూస్తున్నామని, రెండేళ్ల క్రితం మామూలు హోం థియేటర్‌ ఏర్పాటు చేసుకున్నా, ప్రస్తుత సాంకేతికతకు అనుగుణంగా ఆధునికీకరించామని వివరించారు.

యూట్యూబ్‌ స్టార్‌ అప్పలమ్మ - డైలాగ్స్​, ఫైట్స్​లో ఆల్ ​రౌండర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.