"ఈ నెలాఖరుకు కుప్పానికీ నీళ్లు ఇస్తాం. ప్రతీ చెరువుకు నీళ్లు సరఫరా చేస్తాం. ప్రతీ కుంటకూ నీళ్లిస్తాం. భూగర్భ జలాలు పెంచడమే నా లక్ష్యం. వ్యవసాయానికి, పరిశ్రమలకు నీళ్లిచ్చి... రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే నా ధ్యేయం"- చంద్రబాబు
వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాలని చంద్రబాబు అధికారులకుసూచించారు. 67 శాతం పోలవరం పనులు పూర్తచేశామని తెలిపారు. గోదావరి - పెన్నా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామన్నారు. నిర్మాణం మొదలైన62 ప్రాజెక్టుల్లో చాలా వరకూ పలును పూర్తయ్యాయన్నారు.