ETV Bharat / state

ఆస్ట్రేలియా స్టూడెంట్స్ వాలంటరీ సర్వీసెస్ దాతృత్వం - chittoor district updates

కరోనా విలయ తాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న రాష్ట్రానికి చెందిన యువత తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనా వైరస్ వల్ల ఉపాధిని కోల్పోయి ఆకలితో ఆలమటిస్తున్న ఎందరికో అన్నదానం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. చదువుకుంటూ ఖాళీ సమయంలో పార్ట్ టైమ్ జాబ్​లు చేసుకుంటూ వచ్చిన సంపాదనలో కొంత ధనాన్ని ఈ సేవ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు.

Australia Students Voluntary Services
ఆస్టేలియా స్టూడెంట్స్ వాలంటరీ సర్వీసెస్ దాతృత్వం
author img

By

Published : May 20, 2021, 10:49 PM IST

ఆస్ట్రేలియాలో చదవుకోవటానికి వెళ్లిన రాష్ట్రానికి చెందిన యువకులు తమ ఉదారతను చాటుకున్నారు. చదువుకుంటూ ఖాళీ సమయంలో పార్ట్ టైమ్ జాబ్​లు చేసుకుంటూ వచ్చిన సంపాదనలో కొంత ధనాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన 9 మంది కలిసి కరోనాతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి కడుపు నింపే ప్రయత్నం చేశారు.

ఆస్ట్రేలియా స్టూడెంట్స్ వాలంటరీ సర్వీసెస్ పేరుతో వాయు పుత్ర ఆర్ట్స్ తిరుపతి వారి సహకారంతో నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. నగరంలో ఆకలి తీర్చుకోలేని ఎందరికో అన్నదానం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇదీ చదవండి

కొవిడ్ బాధితులకు ఎన్టీఆర్ ట్రస్టు తోడ్పాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.