ETV Bharat / state

వ్యక్తిపై దాడి.. ఆర్థిక లావాదేవీల తగాదే కారణం - attack on firemen news

చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం తిరుమలరెడ్డి గారి పల్లిలో ఫైర్​మెన్​గా పనిచేసే​ సురేశ్​ అనే వ్యక్తిపై దాడి జరిగింది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఏర్పడిన తగాదానే ఘటనకు కారణమని గాయపడిన వ్యక్తి తెలిపాడు.

attack on firemen
దాడిలో గాయపడిన వ్యక్తి
author img

By

Published : Mar 31, 2021, 1:54 PM IST

చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం తిరుమలరెడ్డి గారి పల్లిలో ఫైర్​మెన్​ సురేశ్​పై దాడి జరిగింది. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. పలమనేరులో ఫైర్​మెన్​గా పనిచేసే సురేశ్​ తన గ్రామానికి చెందిన శంకర్​ అనే వ్యక్తికి కొంత డబ్బిచ్చాడు. తిరిగి డబ్బు చెల్లించలేదని.. కోర్టు ద్వారా శంకర్​కు నోటీసులు పంపించాడు. దీంతో కోపోద్రిక్తుడైన శంకర్..​ కుటుంబసభ్యులతో కలిసి దాడికి పాల్పడ్డాడని సురేశ్​ చెప్పాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: పులివెందులలో రోడ్డుప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.