ETV Bharat / state

యూట్యూబ్​లో చూసి నాటుసారా తయారీ... యువ ఇంజినీరు అరెస్టు - chittoor latest news

అతను ఓ యువ ఇంజినీరు. చదువయ్యాక వ్యాపారం చేసి భారీగా నష్టపోయాడు. ఆ సొమ్మును తిరిగి సంపాదించాలన్న ఆశతో అడ్డదారి తొక్కాడు. సాంకేతికత సాయంతో నాటుసారా తయారు చేసి పోలీసులకు చిక్కాడు.

యూట్యూబ్ లో చూసి నాటుసారా తయారు చేస్తున్న యువకుడు అరెస్ట్

author img

By

Published : Sep 12, 2020, 6:46 PM IST

Updated : Sep 13, 2020, 6:12 AM IST

యూట్యూబ్​లో చూస్తూ నాటుసారా తయారు చేస్తున్న చిత్తూరు జిల్లా పాకాల మండలం తోటపల్లికి చెందిన యువ ఇంజినీరు వంశీకృష్ణారెడ్డి(29)ని పోలీసులు అరెస్టు చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆశతో తొలుత కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం సీసాలు తెచ్చి అతడు విక్రయించేవాడు. లక్ష్యాన్ని త్వరగా అందుకోలేమని భావించిన అతను... తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ సమీపంలోని నివాస గృహాల్లో ఒక అద్దె గదిలో స్వయంగా సారా తయారు చేస్తున్నాడు.

అతడు కర్ణాటక మద్యం విక్రయిస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు గదిని సోదా చేశారు. గ్యాస్​స్టవ్​పై నాటుసారా తయారీని గుర్తించారు. సీసాల్లో అతడు 70 లీటర్ల నాటుసారాను నింపాడు. 400 లీటర్ల ఊటను సిద్ధం చేసుకున్నాడు. కర్ణాటక నుంచి లీటరు పరిమాణం ఉండే 44 సీసాలను తెచ్చుకున్నాడు. మద్యంతో పాటు సారాబట్టీ వస్తువులను స్వాధీనం చేసుకున్నామని, నిందితుడి అరెస్టు చేశామని ప్రత్యేక ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో(ఎస్​ఈబీ) తిరుపతి అర్బన్ సీఐ ధీరజ్​రెడ్డి తెలిపారు. నిందితుడికి సహకరిస్తున్న అతడి తమ్ముడు వాసుపై కేసు నమోదు చేశామన్నారు.

నష్టపోయిన డబ్బు సంపాదించాలనే...

ఇంజనీరింగ్​ చదివాక కొంత కాలానికి ఐటీ రంగం వస్తువులను మలేషియాకు వంశీకృష్ణా రెడ్డి ఎగుమతి దిగుమతులు చేసేవాడు. ఈ వ్యాపారంలో 70 లక్షల రూపాయలు నష్టపోయాడు. ఆ తర్వాత వెబ్​ రైటింగ్​ చేస్తూ నెలకు 3.4 లక్షల రూపాయలు సంపాదించాడు. లాక్​డౌన్ నేపథ్యంలో సంపాదన లేక నాటుసారా తయారీపై దృష్టి పెట్టాడని అధికారులు వివరించారు.

ఇదీ చదవండి

శేషాచలం అడవులను లూటీ చేస్తున్న తమిళ స్మగ్లర్లు

Last Updated : Sep 13, 2020, 6:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.