ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేయటాన్ని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో ఆందోళన నిర్వహించారు. పుత్తూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆ సంఘం నేతలు మాట్లాడుతూ... మధ్యాహ్న భోజనం రద్దు చేయడంతో ఎందరో విద్యార్థులు అర్ధాకలితోనే చదువుకోవాల్సిన దుస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి తహసీల్దార్ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందచేశారు.
ఇదీ చూడండి: ఉరేసుకుని నాలుగైదు రోజులవుతోంది?