ETV Bharat / state

HIGH COURT: కుప్పం ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక అధికారిని నియమించండి: హైకోర్టు - special observer be appointed for the counting of votes at kuppam

ap high court
ap high court
author img

By

Published : Nov 16, 2021, 12:52 PM IST

Updated : Nov 16, 2021, 3:34 PM IST

12:50 November 16

కుప్పం మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌

   కుప్పం ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని హైకోర్టు(high court on kuppam election counting) ఆదేశించింది. ప్రత్యేక పరిశీలకుడిగా ఐఏఎస్‌ ప్రభాకర్‌రెడ్డిని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపు మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్​ను న్యాయస్థానం(hc on counting of votes at kuppam) ఆదేశించింది. కౌంటింగ్ వీడియో రికార్డింగ్​ను సోమవారం హైకోర్టుకు సమర్పించాలని కమిషన్‌కు ఉత్తర్వులు జారీ చేసింది.
   కుప్పం నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కుప్పం తెదేపా అభ్యర్ధులు ఓట్ల లెక్కింపును వీడియో రికార్డింగ్ చేయించాలని పిటిషన్​లో కోరారు. ఈ పిటిషన్​ను విచారణకు హైకోర్టు స్వీకరించింది. సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, గింజుపల్లి సుబ్బారావు పిటిషనర్ల తరపున వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం ప్రత్యేక అధికారిగా ఐఏఎస్​ యన్. ప్రభాకర్ రెడ్డిని నియమించాలని(hc order to appointment special observer for the counting of votes at kuppam) హైకోర్టు ఆదేశించింది.  

ఇదీ చదవండి:

Municipal Polls: ఉద్రిక్తతల మధ్య ముగిసిన 'కుప్పం' ఎన్నికల పోలింగ్‌

Last Updated : Nov 16, 2021, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.