జనవరి 4 నుంచి 7వ తేదీ వరకూ నాలుగురోజుల పాటు తిరుపతి వేదికగా స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్‌ను నిర్వహించనున్నట్లు అనంతపురం రేంజ్ డీఐజీ కాంతిరాణా టాటా తెలిపారు. తిరుపతి అర్బన్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డితో కలిసి డ్యూటీ మీట్ లోగోను ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి పోలీసులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. సైబర్, మహిళల భద్రత తదితర అంశాలపై మీటింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకల కోసం గ్రేహౌండ్స్‌లో అసాల్ట్ కమాండర్స్‌గా విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మంది యువ ఐపీఎస్ అధికారులను ప్రత్యేకంగా నియమించినట్లు ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: