ETV Bharat / state

పనులు ప్రశ్నార్థకం..అయిదేళ్లయినా ఊసేలేని 'అమృత్'‌ - amruth scheme news

దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్న చందంగా తయారైంది చిత్తూరు నగరం అభివృద్ధి విషయం.. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమృత్‌ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేసినా సంబంధిత పనులు మాత్రం లక్ష్యాన్ని చేరుకోలేదు.. ఫలితంగా అయిదేళ్లు గడిచినా అడుగు ముందుకు పడలేదు.

amruth
బీవీరెడ్డికాలనీ ఉద్యానవనంలో అమృత్‌ చిహ్నం
author img

By

Published : Nov 2, 2020, 8:02 AM IST

కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 32 అమృత్‌ నగరాల్లో చిత్తూరు ఒకటి. 2015 నుంచి 2020 వరకు అమలయ్యే అమృత్‌ పథకంలో నగరానికి ఐదేళ్ల కాలానికి నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రధానంగా నీటి సరఫరా, ఉద్యానవనాల అభివృద్ధి, సెప్టేజ్‌ ప్లాంట్ల నిర్మాణానికి ఈ నిధులను ఏటా విడుదల చేస్తారు. తొలి ఏడాది 2015-16కు సంబంధించి నగరానికి రూ.3కోట్లు మంజూరయ్యాయి. ఇందులో నగరంలోని ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ల ఏర్పాటుకు రూ.2.50కోట్లు, బీవీరెడ్డి కాలనీకి ఉద్యానవన అభివృద్ధికి రూ.50లక్షలు విభజించారు. బీవీరెడ్డికాలనీ ఉద్యానవన అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. అయితే ఇంటింటికీ కుళాయి కనెక్షన్ల ఏర్పాటు పనులు మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కుళాయి కనెక్షన్లను ఇవ్వడానికి నగరపాలక సంస్థ అధికారులు ఆన్‌లైన్‌లో ఇప్పటివరకు నాలుగు విడతలుగా టెండర్లను ఆహ్వానించారు. అయినా గుత్తేదారులు ఎవరూ టెండర్లు వేయడానికి ముందుకు రాలేదు. నగరంలో దాదాపు 4,600 నీటి కనెక్షన్లను ఉచితంగా ఇవ్వడానికి కేంద్రం నిధులు విడుదల చేసినా దురదృష్టం కొద్దీ గుత్తేదారులు ఈ పనులు చేపట్టడానికి ధైర్యం చేయలేకపోయారు.

ఈ పథకం కింద 2016-17కు సంబంధించి రూ.1.07కోట్లతో మురుకంబట్టులోని అగ్రహారం వినాయకస్వామి ఆలయం కొలనులో కొత్తగా ఉద్యానవన నిర్మాణం చేపట్టారు. ఈ నిధుల్లోనే నగరంలో మరోచోట ఉద్యానవనాన్ని నిర్మించడానికి స్థలం ఎంపిక చేశారు. అయితే అదీనూ ముందుకు సాగలేదు. ఇలా చేపట్టిన పనులన్నీ అడుగు ముందుకు పడలేదు. పైగా ఇవన్నీ ఎప్పటికి మొదలై పూర్తవుతాయనేది ప్రశ్నార్థకమే.

అడవిపల్లె ప్రాజెక్టుకు నిధుల మళ్లింపు

అమృత్‌ పథకానికి సంబంధించి భారీ మొత్తంలో నగరానికి కేటాయించిన నిధుల్లో నీటి ప్రాజెక్టు ఒకటి. నగరంలో నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి 2017లో రూ.250కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో అడవిపల్లె ప్రాజెక్టు నుంచి పైప్‌లైన్‌ ద్వారా నగరానికి నీరు అందించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు పనులు గతంలో ప్రారంభమైనా.. గతేడాది ప్రభుత్వం మారిన తరవాత నిలిచిపోయాయి. ఇక.. వీటితోపాటు నగరంలోని ఓబనపల్లె, గాయత్రినగర్‌లో రూ.87లక్షలతో ఉద్యానవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టగా అవీ టెండర్ల దశలోనే ఆగిపోయాయి. 2015లో అమృత్‌ పథకం ప్రారంభమైనా ఉద్యానవనం తప్పితే ఇప్పటివరకు నగరానికి ఒనగూరిన ప్రయోజనం శూన్యమే. ఈ పథకం ద్వారా రూ.50లక్షలతో బీవీరెడ్డికాలనీలో ఉద్యానవన పునర్నిర్మాణం మాత్రమే పూర్తయింది. నాలుగేళ్లుగా ఈ పథకం పేరుతో రూ.కోట్ల నిధుల కేటాయింపులు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఈ పథకం కింద రాష్ట్రంలో పలు పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించినా.. నగరంలో మాత్రం ఫలితం శూన్యం.

ఇదీ చదవండి:

ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలకు టీసీలు అక్కర్లేదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.