Amravati parirakshana Mahodyama Sabha: 'అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ' పేరిట రేపు రాజధాని రైతులు నిర్వహిస్తున్న బహిరంగ సభకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ మేర ఐకాస నేతలు సభా ప్రాంగణం వద్ద భూమి పూజ నిర్వహించారు. రైతులు అమరావతి నినాదం ఎలుగెత్తి చాటేలా ఈ సభ నిర్వహిస్తున్నారు. తెదేపా, కాంగ్రెస్, భాజపా, జనసేన, సీపీఐ, సీపీఎం వంటి అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ఆహ్వానాలు పంపారు. ప్రజా, రైతు, వర్తక, వాణిజ్య సంఘాలను ఆహ్వానించారు. తెదేపా నుంచి చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఇతర ముఖ్య నేతలు సభకు హాజరు కానున్నారు.
Amaravati agitation: దాదాపు 20ఎకరాలకు పైగా స్థలంలో సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ వేదిక ఏర్పాటు చేయనున్నారు. వీవీఐపీ, వీఐపీ, మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చూసేవిధంగా వీలుగా ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. సభకు ఎంత మంది వచ్చినా అందరూ భోజనం చేసేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి..
Amravathi Sabha: అమరావతి పరిరక్షణ మహోద్యమ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు