చిత్తూరు జిల్లాలో వ్యవసాయానికి నూతనోత్సాహం వచ్చింది. కరోనా ప్రభావంతో సొంతగూటికి చేరుకుంటున్న వారంతా వ్యవసాయంపై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో నాడు ఎటు చూసిన బీడు భూములగా మారిన లక్షల ఎకరాలు.. నేడు దుక్కులకు నోచుకుంటున్నాయి. పట్టణాల్లో కొలువులు వదిలేసి వచ్చి ఖరీఫ్ సేద్యంలో నిమగ్నమవుతున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు.
చిత్తూరు జిల్లాలోని పడమటి నియోజకవర్గాల్లో ముఖ్యంగా తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు చేసేందుకు పట్టణాల నుంచి వచ్చిన రైతులు, కూలీలు, ఉద్యోగులు, విద్యావంతులు, వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి ఏడాది ఖరీఫ్‌లో సగం వరకు భూములు బీడుగా కనిపించేవి. నేడు పూర్తిస్థాయిలో దుక్కులకు నోచుకుంటున్నాయి. తంబళ్లపల్లి మదనపల్లి వ్యవసాయ శాఖ డివిజన్ పరిధిలో 42 వేల హెక్టార్లకు పైగా పూర్తిస్థాయిలో మెట్ట భూములు సాగు కానున్నాయి. ఇందుకు తగ్గట్టుగా ప్రభుత్వం కూడా విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు రాయితీ ధరలపై సరఫరా చేయాల్సి ఉంది. పంటల దిగుబడులకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని విద్యావంతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి