ETV Bharat / state

చెట్టును ఢీకొన్న వ్యాన్..ఒకరు మృతి.. మరొకరికి గాయాలు - చెట్టుకు వ్యాన్​ ఢీకొని వ్యక్తి మృతి వార్తలు

చెట్టును వ్యాన్​ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుణ్ని పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చెట్టుకు వ్యాన్​ ఢీకొని వ్యక్తి మృతి.. మరొకరికి గాయాలు

author img

By

Published : Aug 17, 2020, 3:45 PM IST

చిత్తూరు జిల్లా యాదమరి ఎంపీడీవో కార్యాలయం ఎదుట చెట్టును వ్యాన్​ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తి గాయపడ్డారు. కడప జిల్లా రాజంపేట నుంచి తమిళనాడు నామక్కల్​కు వెళ్తున్న కోళ్ల వ్యాన్​ ఆదివారం రాత్రి ఒంటిగంట సమయంలో అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్​ క్లీనర్​ అశోక్​ కుమార్​ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

డ్రైవర్​ రాధాకృష్ణకు తీవ్ర గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదంపై యాదమరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి..

కుప్పంలో రౌడీ షీటర్ దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.