చిత్తూరు జిల్లా తిరుపతి కానిపాకం వరసిద్ధ వినాయకుని ఆలయ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆలయ ప్రసాదం గా విక్రయించే లడ్డు తయారీ కేంద్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లడ్డు తయారీ ని కానిపాకం ఆలయం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించింది. ఈ కేంద్రంలోనే అగ్ని ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న ఆగ్నిమాపక బృందం మంటలను వెంటనే ఆర్పివేసింది. కొద్ది పాటి నష్టంతోనే బయట పడటంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి:భారీ చోరీ.. బంగారం, నగదు మాయం