ETV Bharat / state

కూతురికి ఓటేసి.. కన్నుమూసిన తండ్రి - చిత్తూరు జిల్లా రామసముద్రం

పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓ వృద్ధుడు.. ఓటు వేసిన అనంతరం పోలింగ్ కేంద్రానికి సమీపంలోనే కన్నుమూశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

A father who voted for his daughter in the panchayat elections later died near a polling station in chittoor
కూతురికి ఓటేసి.. కన్నుమూసిన ఓ వృద్ధుడు
author img

By

Published : Feb 13, 2021, 4:28 PM IST

Updated : Feb 13, 2021, 4:38 PM IST

పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్​గా నిలబడిన కుమార్తెకి ఓటు వేసిన ఓ తండ్రి.. పోలింగ్ కేంద్రానికి సమీపంలోనే మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన చిత్తూరు జిల్లా రామసముద్రంలో చోటుచేసుకుంది.

స్థానికుడు గంగప్ప(65).. కూతురికి ఓటు వేయడానికి ఉదయాన్నే పోలింగ్​ కేంద్రానికి చేరుకున్నాడు. ఓటును వినియోగించుకున్న అనంతరం.. పోలింగ్ కేంద్రం బయటకు వచ్చి సొమ్మసిల్లి పడిపోయాడు.

అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బాధితుడిని ఆటోలో ఇంటికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యంలోనే అతడు ప్రాణాలు విడిచాడు. ఇంటి పెద్ద మరణంతో ఆ ఇంట్లో తీరని విషాదం నెలకొంది.

ఇదీ చదవండి: బాధ్యత మరువని 102 ఏళ్ల వృద్ధురాలు

Last Updated : Feb 13, 2021, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.