చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం మద్దలకుంటలో విషాదం నెలకొంది. వ్యవసాయ బావిలో దూకి దంపతులు ఆత్మహత్య చేసుకోవడం గ్రామంలో కలకలం రేపింది. మదనపల్లికి చెందిన గంగాధర(22) అత్తగారి ఊరు అయిన మద్దలకుంటకు రాగా.. నిన్న సాయంత్రం నుంచి తన భార్య సోనియా(19)తో కలిసి కనిపించకుండా వెళ్లిపోయాడు.
దంపతుల కోసం గ్రామస్థులు వారి కోసం వెతకగా గ్రామంలోని వ్యవసాయ బావిలో మృతదేహాలను గుర్తించారు. ఏడాది క్రితం వీరిద్దరికీ వివాహం కాగా.. మృతురాలు ప్రస్తుతం 8 నెలల గర్భవతి. దంపతుల ఆత్మహత్యకు గల కారణాల గురించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: ప్రేమ పెళ్లి గలాట: ఇరు వర్గాల ఘర్షణ.. 20 మందిపై కేసులు