ETV Bharat / state

ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో నేడే తీర్పు - 6years girl raped case verdict come on today by chittor dst court

చిత్తూరు జిల్లాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసిన కేసులో నేడు తుది తీర్పు రానుంది. గతేడాది నవంబర్​లో ఈ ఘటన జరగగా వంద రోజుల్లోనే కేసుకు సంబంధించిన విచారణను పోలీసులు పూర్తి చేశారు. ఇప్పటివరకూ 47మంది సాక్షులను మొదటి అదనపు జిల్లా కోర్టు విచారించింది.

ఆరేళ్లబాలిక హత్యాచార కేసులో నేడే తీర్పు
ఆరేళ్లబాలిక హత్యాచార కేసులో నేడే తీర్పు
author img

By

Published : Feb 18, 2020, 1:32 AM IST

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నారి హత్య కేసులో తీర్పును మంగళవారం కోర్టు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో విచారణలు ముగిసి తీర్పు రిజర్వు చేసినట్లు సమాచారం. చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలోని ఓ కల్యాణ మండపంలో గతేడాది నవంబరు ఏడో తేదీన బాలిక(6) హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకుని మదనపల్లె మండలం బసినికొండ గ్రామానికి చెందిన లారీ క్లీనర్‌ మహ్మద్‌ రఫీ(27)ను అదే నెల 16న అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. నిందితుడిపై చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం(పోక్సో), హత్య కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు విచారణను స్థానిక మొదటి అదనపు జిల్లా కోర్టు చేపట్టింది. మొత్తం 47 మంది సాక్షులను విచారించింది. ఈ కేసుపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. తుది తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది.

ఇదీ చూడండి

ఈ వీడియో చూస్తే రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉంటారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.