ETV Bharat / state

టాస్క్​పోర్స్​ అదుపులో 25 మంది.. ఎర్రచందనం స్మగ్లర్లుగా అనుమానం

ఎర్రచందనం స్మగ్లర్లుగా అనుమానిస్తున్న 25 మంది తమిళనాడు వాసులను ఎర్రచందనం పరిరక్షక దళం (టాస్క్‌ఫోర్స్‌) అదుపులోకి తీసుకుంది. చిత్తూరు జిల్లా వడమాలపేట చెక్‌పోస్ట్‌ వద్ద నిర్వహించిన తనిఖీల్లో అనుమానితులు పట్టుబడ్డారు.

suspicion of red sandalwood smugglers arrest
టాస్కపోర్స్​ అదుపులో 25 మంది.. ఎర్రచందనం స్మగ్లర్లుగా అనుమానం
author img

By

Published : Dec 18, 2020, 10:59 PM IST

చిత్తూరు జిల్లాలో వడమాలపేట చెక్‌పోస్ట్‌ వద్ద టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ వెంకటయ్య ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. చెన్నై నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ఓ లారీలో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న 25 మంది తమిళనాడు వాసులను విచారించారు. వారితో పాటు 75 కిలోల బియ్యం, పప్పు, కూరగాయలు, ఇతర నిత్యావసర సరకులు ఉన్నాయి. దీంతో లారీతో పాటు 25 మందిని తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి తరలించారు. ఎర్రచందనం కోసం శేషాచలం అటవీప్రాంతంలోకి వెళ్లడానికి ఆహార పదార్థాలతో వస్తునట్లు విచారణలో గుర్తించారు.

అదుపులోకి తీసుకొన్న వారిలో... అటవీశాఖ అధికారులు హత్య కేసులో నిందితుడు అర్జున్ ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపారు. వడమాల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసిన అధికారులు... స్థానిక పోలీసులతో కలిసి పూర్తిస్థాయి విచారణ నిర్వహించనున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ తెలిపారు.

రూటు మార్చిన స్మగ్లర్లు..

యర్రావారిపాళ్యం మండలంలోని శేషాచల అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు రూటు మార్చారు. ఒక వైపు తమిళ స్మగ్లర్లు ఎర్రచందనాన్ని సరిహద్దులు దాటిస్తుంటే మరోవైపు లోకల్ స్మగ్లర్స్ శ్రీ గంధం చెట్లపై కన్నేశారు. తలకోన అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న ఫారెస్ట్ అధికారులకు నలుగురు స్మగ్లర్లు తారసపడ్డారు. పాలెం బండలు వద్ద ముగ్గురిని అదుపులోకి తీసుకోగా.. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి నుంచి 30 కేజీల విలువైన 17 శ్రీ గంధం దుంగలు, ఇతర సామగ్రితోపాటు పాటు బైకును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న స్మగ్లర్ కోసం గాలిస్తున్నట్లు ఎఫ్ఆర్వో పట్టాభి తెలిపారు.

ఇదీ చదవండి:

విషాదం: పెన్నా నదిలో ఏడుగురు గల్లంతు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.