ETV Bharat / state

మదార్​పురం ప్రమాదం: స్వస్థలాలకు మృతదేహాలు - karnool road accident updates

కర్నూలు జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన 14 మంది మృతదేహాలను చిత్తూరు జిల్లాకు తీసుకువెళ్లారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అనంతరం ఆదివారం రాత్రికే మూడు మృత దేహాలు మదనపల్లెకు చేరుకోగా.. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో మిగిలిన మృత దేహాలను స్వస్థలాలకు బంధువులు తీసుకువచ్చారు.

14 dead bodied reached to native place in karnool district madharpur

author img

By

Published : Feb 15, 2021, 8:11 AM IST

కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలోని మదార్‌పురం వద్ద జరిగిన ఘర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు చిత్తూరు జిల్లాలకు చేరుకున్నాయి. ప్రమాదంలో మృతిచెందిన 14మంది మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం.. వారి స్వస్థలాలకు చేర్చారు. గుర్రంకొండ మండలం తరిగొండకు 7 మృతదేహాలు చేరుకున్నాయి. బి.కొత్తకోట మండలం సర్కారుతోపు గ్రామానికి చేరుకున్న 4 మృతదేహాలు తీసుకువెళ్లారు. చిత్తూరు జిల్లా మదనపల్లెకు ఆదివారం రాత్రే 3 మృతదేహాలు చేరుకున్నాయి. 14 మృతదేహాలకు నేడు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం.

కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలోని మదార్‌పురం వద్ద జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-44)పై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఒకే కుటుంబంలోని 12 మంది, వాహనం డ్రైవరు, మెకానిక్‌లతో కలిపి 14 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 8 మంది మహిళలు, అయిదుగురు పురుషులతోపాటు ఏడాది చిన్నారి ఉన్నారు.

ఇదీ చదవండి: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... 14 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.