రాష్ట్ర హక్కుల కోసం భాజపాపై సీఎం అలుపెరగని పోరు చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ అన్నారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన దేశ రాజకీయాల్లో చంద్రబాబు పాత్ర కీలకమని తెలిపారు. కేంద్రంతో ఎప్పుడు పోరాడాలో సీఎంకు తెలిసని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా మోదీ ఏపీకి ఎలా వస్తారని ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే నిధులు వెనక్కి తీసుకున్న చరిత్ర భాజపా పార్టీదని టీజీ వెంకటేశ్ విమర్శించారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య ఎన్నిక తెదేపా మద్దుతు తెలిపింది రాష్ట్ర అభివృద్ధి కోసమేనన్న ఎంపీ..పీవీ ప్రధాని అయ్యినప్పుడు తెలుగు పార్టీలన్నీ ఒక్క మాటపై నిలిచాయన్నారు.
కర్నూలు రాజకీయంపై...
కర్నూలులో గెలిచే అవకాశం తన కుమారుడు భరత్‌కు ఉన్నాయన్న టీజీ సీఎం నిర్ణయమే అంతిమమని తెలిపారు. కేఈ, కోట్ల కుటుంబాలు గెలుస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. కేఈ కుటుంబ సభ్యులు సీఎంను కలిశారన్న వార్తను చూశారన్న ఎంపీ గెలిచేవారికే తెదేపా సీటు ఇస్తుందని పేర్కొన్నారు.
కేఈ కుటుంబ సభ్యులు సీఎం ను కలిశారని.. వారు కర్నూలు సీటు అడిగినట్లు వార్తల్లో చూశాను.