రాష్ట్రంలో నేటి నుంచి ఎండలు మండనున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా భానుడి ప్రతాపం మరింత పెరిగే అవకాశముంది. మరోవైపు అండమాన్ దీవుల్లో నైరుతి పవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈనెల 30వ తేదీలోపు అండమాన్ దీవుల్లోని మరిన్ని ప్రాంతాలకు దక్షిణ బంగాళాఖాతంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశముందని హెచ్చరించారు. జూన్ 6 లోపు కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణశాఖ ఇది వరకే ప్రకటించింది. ప్రస్తుతం తమిళనాడు, రాయలసీమ మీదుగా ద్రోణి, ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వెల్లడించారు. దీని ఫలితంగా రానున్న నాలుగురోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఒకట్రెండుచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది
రాష్ట్రంలో నేటి నుంచి మరింత మండనున్న ఎండలు
ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలతో ఇల్లు దాటాలంటే భయపడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. మరో నాలుగు రోజులు ఎండలు మరింత పెరిగే అవకాశముందని తెలిపింది.