శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంను తెదేపా ఎమ్మెల్యేలు విరామ సమయంలో కలిశారు. పోలవరంపై ప్రశ్నోత్తరాల్లో తెదేపా తరఫున సిగ్నటరీలకూ అవకాశం కల్పించాలన్నారు. వైకాపా తరఫున సిగ్నటరీలు కాకున్నా అవకాశం ఇస్తున్నారని.. తెదేపా ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమ, మంగళవారాల్లో పోలవరంపై చర్చకు అవకాశమిస్తానని స్పీకర్ చెప్పారని తెదేపా సభ్యులు తెలిపారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని సభాపతి కోరారని చెప్పారు.
ఇదీ చదవండి... ఇంట్లోకి వచ్చి మంచం ఎక్కిన పులి...!