ETV Bharat / state

సీబీఐ పిలుపు- దేనికైనా రెడీ అన్న సుజనా

కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరికి సీబీఐ నుంచి పిలుపు వచ్చింది. బ్యాంకుల మోసం కేసులో విచారణకు హాజరుకావాలని సమన్లు జారీచేసినట్లు పీటీఐ తెలిపింది. నోటీసు జారీ చేసిన సంస్థలతో తనకు సంబంధం లేదని మాజీ మంత్రి ప్రకటించారు.

సీబీఐ ముందు హాజరుకానున్న సుజనాచౌదరి
author img

By

Published : Apr 25, 2019, 6:41 PM IST

Updated : Apr 25, 2019, 7:39 PM IST

2017లో నమోదు చేసిన కేసులో సీబీఐ బెంగళూరు బ్రాంచ్‌ ..సుజనా చౌదరికి సమన్లు జారీ చేసిందని పీటీఐ తెలిపింది. బెస్ట్‌ అండ్ క్రాంప్టన్‌ కంపెనీ వ్యవహారంలో బ్యాంకులకు నష్టం చేకూర్చినట్లు కేసు నమోదుచేశారని చెప్పింది. 2017లో ఆంధ్రా బ్యాంకును రూ.71 కోట్ల మేర మోసం చేసిన కేసులో సమన్లు జారీ అయ్యాయని తెలిపింది. ఈ వ్యవహారంలో తమ ముందు హాజరుకావాలని సీబీఐ సమన్లు పంపిందని... శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరు సీబీఐ అధికారుల ముందు సుజనాచౌదరి హాజరుకానున్నారని చెప్పింది.

సంబంధం లేని అంశాల్లో నోటీసులా?: సుజనా

సీబీఐ ముందు హాజరుకానున్న సుజనాచౌదరి
సీబీఐ ముందు హాజరుకానున్న సుజనాచౌదరి

సీబీఐ సమన్లపై సుజనా చౌదరి ఓ నోట్‌ విడుదల చేశారు. సీబీఐ జారీ చేసిన సమన్లు బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజినీరింగ్ ప్రాజెక్టు లిమిటెడ్‌కు చెందినవని పేర్కొన్నారు. ఆ కంపెనీతో తనకు సంబంధమే లేదని తేల్చి చెప్పారు. 2014 నుంచి ఏ కంపెనీలోనూ ఎగ్జిక్యుటివ్‌, నాన్‌ ఎగ్జిక్యుటివ్‌ డైరెక్టర్‌గా లేనని వెల్లడించారు. 2003 నుంచి 2014 వరకు 3 లిస్ట్‌డ్‌ కంపెనీల్లో నాన్‌ ఎగ్జిక్యుటివ్‌ హోదాలో ఉన్నానని పేర్కొన్నారు. యూనివర్సల్ ఇండస్ట్రీస్‌, స్పెల్‌డిడ్‌ మెటల్ ప్రొడక్స్, నియాన్‌ టవర్స్‌ కంపెనీల్లో నాన్‌ ఎగ్జిక్యూటివ్ హోదాలో ఉన్నట్టు తెలిపారు. తనకు సంబంధం లేదని సంస్థ వ్యవహారాల్లో నోటీసులు ఇచ్చారని... తదుపరి చర్యలకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు.

Intro:SLUG:- AP_SKLM_101_25_COLLECTOR_INAGURATION_DCCB_ATM_AVB_C8

యాంకర్:- శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని దండి వీధిలో కల జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎటిఎం జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిసిసిబి 19 శాఖలను కలిగి ఉందన్నారు. ఏటీఎం ఏర్పాటు వలన ఖాతాదారులకు మంచి వెసులుబాటు కలుగుతుంది అన్నారు. ఏటీఎంలో ఏ బ్యాంకు కు చెందిన ఏటీఎం కార్డ్ అయినా ఉపయోగించవచ్చు అన్నారు. కొద్ది రోజుల క్రితం సంతకవిటి, బుడితి, మెట్టూరు,ఎంఎస్ పల్లి లలో ఏటీఎంలను బ్యాంకు ఏర్పాటు చేసిందని, కొత్తగా పూండి, నిమ్మాడ, ఉర్లాం, శ్రీకూర్మం, రాగోలు, ఎల్.ఎన్.పేటలలో ఏటీఎంలను ఏర్పాటు చేయడం బ్యాంకు పనితీరుకు నిదర్శనంగా కనిపిస్తుంది అని అన్నారు.

బైట్:- జె.నివాస్, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్.

Body:1

Conclusion:1
Last Updated : Apr 25, 2019, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.