ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని ఆ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య విజయవాడలో స్పష్టం చేశారు. వైకాపా నేతలు లేని మాయమాటలు చెప్పి కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. 53వేల మందికి పైగానే ఆర్టీసీలో పని చేస్తున్నారని..అలాంటి సంస్థను పార్థసారధి లాంటి నేతలు నాశనం చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. 2015 తర్వాత ఒక రూపాయి సైతం ఆర్టీసీలో ఛార్జీలు పెంచలేదని స్పష్టం చేశారు. 15వందల కోట్లు రాయితీ ఇస్తే భారీ నష్టాల నుంచి ఆర్టీసీ బయటపడుతుందని వర్ల తెలిపారు. చార్జీలు పెంచాల్సిందిగా ప్రభుత్వానికి ప్రతిపాదన పెడుతున్నామని తెలిపారు. ప్రతి ఏడాది 7.5 శాతం చార్జీల పెంపునకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతామని ఆయన స్పష్టం చేశారు.
ఇవీ చూడండి-ఎన్నికలను పెద్ద ప్రహసనంలా మార్చారు: జేపీ