గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని 5 కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలీంగ్ జరగనుంది. నరసరావుపేట అసెంబ్లీ స్థానం పరిధిలోని 94వ బూత్, గుంటూరు పశ్చిమ స్థానం పరిధిలోని 244వ బూత్, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం అసెంబ్లీ స్థానం పరిధిలోని 247వ బూత్, నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ స్థానం పరిధిలోని 41వ బూత్, సూళ్లూరుపేట అసెంబ్లీ స్థానం పరిధిలోని 197వ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించనున్నారు.
ఏర్పాట్లు పూర్తి..
రాష్ట్ర వ్యాప్తంగా రీపోలింగ్ జరగనున్న ఐదు కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే పోలీంగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ నెల 11న జరిగిన పోలీంగ్‌లో కొన్ని చోట్ల ఈవీఎంలు మెురాయించగా..మరి కొన్ని చోట్ల ఇతర కారణాలతో చాలమంది ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. ఈ విషయాన్ని ఆయా పోలీంగ్ కేంద్రాల అధికారులు జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లగా..ఎన్నికల కమిషన్ రీ పోలీంగ్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది.
ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకుంటారంటే!
* నరసరావుపేట అసెంబ్లీ పరిధిలోని కేసానుపల్లిలో 956 మంది ఓటర్లు.
* గుంటూరు పశ్చిమ పరిధిలోని నల్లచెరువులో 1,376 మంది ఓటర్లు.
* యర్రగొండపాలెం అసెంబ్లీ స్థానం పరిధిలోని కలనూతలలో 1,070 మంది ఓటర్లు.
* కోవూరు అసెంబ్లీ స్థానం పరిధిలోని ఇసుకపాలెంలో 1,084 మంది ఓటర్లు.
* సూళ్లూరుపేట అసెంబ్లీ స్థానం పరిధిలోని అటకానితిప్పలో 578 మంది ఓటర్లు.
ఏపీలోని 5 కేంద్రాల్లో రీపోలింగ్
ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాల పరిధిలోని ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభమైంది. వీటి పరిధిలో శనివారం సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా..పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని 5 కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలీంగ్ జరగనుంది. నరసరావుపేట అసెంబ్లీ స్థానం పరిధిలోని 94వ బూత్, గుంటూరు పశ్చిమ స్థానం పరిధిలోని 244వ బూత్, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం అసెంబ్లీ స్థానం పరిధిలోని 247వ బూత్, నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ స్థానం పరిధిలోని 41వ బూత్, సూళ్లూరుపేట అసెంబ్లీ స్థానం పరిధిలోని 197వ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించనున్నారు.
ఏర్పాట్లు పూర్తి..
రాష్ట్ర వ్యాప్తంగా రీపోలింగ్ జరగనున్న ఐదు కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే పోలీంగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ నెల 11న జరిగిన పోలీంగ్‌లో కొన్ని చోట్ల ఈవీఎంలు మెురాయించగా..మరి కొన్ని చోట్ల ఇతర కారణాలతో చాలమంది ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. ఈ విషయాన్ని ఆయా పోలీంగ్ కేంద్రాల అధికారులు జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లగా..ఎన్నికల కమిషన్ రీ పోలీంగ్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది.
ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకుంటారంటే!
* నరసరావుపేట అసెంబ్లీ పరిధిలోని కేసానుపల్లిలో 956 మంది ఓటర్లు.
* గుంటూరు పశ్చిమ పరిధిలోని నల్లచెరువులో 1,376 మంది ఓటర్లు.
* యర్రగొండపాలెం అసెంబ్లీ స్థానం పరిధిలోని కలనూతలలో 1,070 మంది ఓటర్లు.
* కోవూరు అసెంబ్లీ స్థానం పరిధిలోని ఇసుకపాలెంలో 1,084 మంది ఓటర్లు.
* సూళ్లూరుపేట అసెంబ్లీ స్థానం పరిధిలోని అటకానితిప్పలో 578 మంది ఓటర్లు.
New Delhi, May 05 (ANI): Former Delhi chief minister Sheila Dikshit held a door-to-door campaign in Seelampur area on Sunday. She is Congress's candidate from North-East Delhi parliamentary constituency. She is contesting against BJP's sitting MP Manoj Tiwari and Aam Aadmi Party's (AAP) Dilip Pandey. Delhi will go to polls on May 12.