ETV Bharat / state

'కేటీఆర్ వ్యాఖ్యలు కుట్రకు పరాకాష్ట'

సమాచార చోరీపై తెలుగుదేశం పార్టీ... వైకాపాల మధ్య వైరం ఇప్పుడు 2 రాష్ట్రాల గొడవగా మారింది. తమ డేటా అపహరణకు వైకాపా ప్రయత్నిస్తుంటే... తెరాస ప్రభుత్వం వారికి సహకరిస్తుందని మంత్రులు నక్కా ఆనందబాబు... సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డి ఆరోపించారు. వైకాపా నాయకులు హైదరాబాద్​లో ఫిర్యాదు చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సమయంలో జగన్​కు మద్దతు తెలుపుతూ... తెరాస నేతలు తెదేపాపై విమర్శలు చేయడంతో... 2 రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

కేటీఆర్ వ్యాఖ్యలు కుట్రకు పరాకాష్ట
author img

By

Published : Mar 5, 2019, 2:20 AM IST

Updated : Mar 5, 2019, 3:06 AM IST

సమాచార చోరీపై కోర్టుకు ఎందుకు వెళ్లారని తెదేపాను కేటీఆర్ ప్రశ్నించడం... కుట్రకు పరాకాష్టగా తెదేపా మంత్రులు అభివర్ణించారు. కేటీఆర్ వ్యాఖ్యల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుపై కక్ష... రాష్ట్ర ప్రజలపై ద్వేషం కనిపిస్తోందని ఆరోపించారు. ఉద్యోగులను అరెస్టు చేయకపోతే వారి బంధువులను... ఏపీ పోలీసులను ఎందుకు కలవనివ్వలేదని తెదేపా నేతలు ప్రశ్నించారు. లోకేశ్వర్​రెడ్డికి ఏపీ డేటాతో ఏం సంబంధం ఉందని నిలదీశారు.

డేటా చోరీపై వచ్చిన ఫిర్యాదు గురించి... ప్రైవేట్ కంపెనీలో ఆ సమాచారముందని ఏపీ ప్రభుత్వానికి ఎందుకు తెలియజేయలేదని ప్రశ్నించారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్​లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సమాన హక్కులుంటాయని గుర్తుచేశారు. ఈ కేసును తెరాస నేతలు... తెలంగాణ ప్రభుత్వం మసిబూసి మారేడుకాయ చేయాలని చూసినా... న్యాయ స్థానాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. ప్రజలకు జవాబివ్వాల్సిన బాధ్యత తెలంగాణ పోలీసులపై ఉందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సమాచారం... ఈ-ప్రగతి... ఈ-సేవ... ఈ-కేబినెట్... అన్ని పథకాల వివరాలు ఆన్​లైన్​లో ఉన్నాయని... జీవోలు కూడా అంతర్జాలంలో పొందుపరుస్తున్నామని మంత్రులు స్పష్టం చేశారు. పారదర్శక పాలనకు ఇవి నిదర్శనమన్నారు. అవినీతి రహిత రాష్ట్రంగా ఏపీకి పేరుందన్నారు. 24 ఏళ్ల క్రితమే తెలుగుదేశం పార్టీ సమాచారమంతా కంప్యూటరీకరణ జరిగిందన్న మంత్రులు... జగన్ కోసం కేసీఆర్... కేటీఆర్​ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

sample description
Last Updated : Mar 5, 2019, 3:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.