ETV Bharat / state

మనుషుల్ని వేటాడుతారు వీరు! - gangrape

మనుషుల్ని మృగాల్లాగా వేటాడడం వారికి సరదా. శారీరక వాంఛ తీర్చుకుని ఆడపిల్లన్ని చంపేయడం వారికి రాక్షసానందం. కలియుగంలోనూ రాక్షస సంతతి తిరుగాడుతుందనడానికి రుజువులు వారు. నేరం అనే పదానికి నిలువెత్తు సాక్ష్యం వారు. ప్రేమ జంటలే లక్ష్యంగా రక్త చరిత్రను లిఖించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 32 నేరాలు చేసి దర్జాగా తిరుగుతున్నవారు.. ఎట్టకేలకు పోలీసులుకు చిక్కారు.

పోలీసుల అదుపులో నిందితులు
author img

By

Published : Mar 4, 2019, 6:37 AM IST

Updated : Mar 4, 2019, 7:31 AM IST

నిర్మానుష్య ప్రాంతాల్లో... ఒంటరిగా కనిపించే జంటలే వారి లక్ష్యం. మగ వారిపై ఆటవికంగా దాడి చేసి హత్య చేయటం... ఆపై మహిళలపై అత్యాచారం చేసి నగదు దోచుకోవటం వారి నైజం. చూసేందుకు సాధారణంగా కనబడతారు కానీ వారి నేర చరిత్ర వింటే ఎంతటివారికైనా గుండె వేగం పెరగాల్సిందే. ఇది చిత్ర కథకాదు. తాజాగా జిల్లాలోని కామవరపుకోటలో బౌద్ధరామాలయాల వద్ద జరిగిన శ్రీధరిణి హత్య కేసులో నిందితుల నేర చరిత్ర ఇది.పోలీసుల నిర్లక్ష్యాన్నే ఆయుధంగా చేసుకుని రెండేళ్లలో 32 నేరాలు చేశారు. జిల్లా ఎస్పీ సైతం వీరి నేర చరిత్ర విని ఆశ్చర్యపోయారు.

కాపలాదారులు నుంచి క్రూరులుగా
పశ్చిమగోదావరిజిల్లా కామవరపుకోట మండలం జీలకర్రగూడెం బౌద్ధారామ గుహల వద్ద గతనెల 24న యువతిపై లైంగిక దాడిచేయడమేకాకుండా ఆమెను హత్యచేశారు. ఆమెతో ఉన్న ప్రియుణ్ని తీవ్రంగా గాయపరిచారు. ఈ కేసు చేధనకు రంగంలోకి దిగిన పోలీసులు జట్లుగా ఏర్పడి దర్యాప్తు చేశారు. నలుగురు యువకుల్ని అనుమానితులుగా గుర్తించి.. అదుపులోకి తీసుకొని విచారించగా నివ్వెరపోయే విషయాలు వెలుగుచూశాయి.
శ్రీధరణి కేసులో ప్రధాన నిందితుడు అంకమ్మరావు అలియాస్ రాజు.. మైలవరం మండలంలోని చంద్రాల గ్రామనివాసి. కొంతకాలం జీడిమామిడి తోటలకు కాపలదారుడిగా ఉన్న ఇతను... రాక్షసుడిగా మారాడు. మామిడి తోటల్లోకి వచ్చే ప్రేమ జంటలే లక్ష్యంగా దాడులకు తెగబడేవాడు. మోసాలకు అలవాటుపడి ఆగిరిపల్లికి చెందిన నాగరాజు, తన బావమరుదులైన సోమయ్య ,గంగయ్యలను సాయంతో ఎన్నో దుర్మార్గాలకు పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా తిరువూరు నుంచి పశ్చిమగోదావరి జిల్లా బౌద్ధరామాలయాల వరకు వరసగా హత్యలు లేదంటే దాడులు చేసుకుంటూ వెళ్లిపోయారు ఈ ముఠా సభ్యులు.
కనివినీ ఎరుగని రీతిలో
జనవరి 6 న వీరులపాడు పరిధిలో గోపి అనే వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. యువతితో కలిసి ఏకాంతంగా గడపడానికి వెళ్లి శవమై తేలాడు. ప్రియురాలే నిందుతురాలిగా తొలుత పోలీసులు భావించిన అది నిజం కాదని తేలింది. నవంబర్ 23 న విస్సన్నపేట పీఎస్ పరిధిలో ఓ యువకుడు మృతి కూడా ఇలాంటిదే. రెడ్డిగూడెంకు చెందిన చంద్రకాంత్ ఆటోడ్రైవర్ గా పనిచేస్తున్నాడు .తన స్నేహితురాలితో కలిసి విస్సన్నపేటకు మూడు కిలోమీటర్ల దూరంలోని తోటల్లోకి వెళ్లి శవమై తేలాడు. ప్రాథమికంగా దర్యాప్తు చేసిన పోలీసులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించారు. అయితే సంఘటనా స్థలంలో పెనుగులాట జరిగిన ఆధారాలు ,యువతికి సంబంధించిన వస్తువులు ఉన్నా పోలీసులు పట్టించుకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ రెండు కేసులు అంకమ్మరావు అలియాస్ రాజు చేశాడని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు చేసిన దర్యాప్తులో తేలింది. ఇవే కాక సుమారు 30కి పైగా దాడులు చేసింది ఈ దండుపాళ్యం బృందం. పశ్చిమగోదావరి పోలీసుల సమాచారం ప్రకారం కృష్ణాజిల్లా ఆగిరిపల్లిలో 7, నూజివీడు లో13, విస్సన్నపేట లో2 ,వీరులపాడులో 1, గన్నవరం 1, జి. కొండూరులో నేరాలు చేశారని తెలుస్తోంది. సంబంధింత పోలీసుస్టేషన్లలో ఇటువంటి సంఘటనలు ఎక్కడెక్కడ జరిగాయి. వాటి దర్యాప్తు ఎంతవరకు కొనసాగింది అని ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

undefined

నేరచరిత్ర

Intro:ap_tpg_31_04_lakshamaneswara temple_avb_c4.

యాంకర్....లక్ష్మణేశ్వరంలో దుర్గాలక్ష్మణేస్వరం స్వామి ఆలయంలో అభిషేకాలు.

Body:వాయిస్ ఓవర్.... మహాశివరాత్రి పురస్కరించుకొని పశ్చిమ జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం దుర్గా లక్ష్మణ స్వామి ఆలయంలో స్వామివారికి వైభవంగా పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు వేకువజాము నుంచి భక్తులు సమీపంలోని రాజు లంక గోదావరి ఘాట్ లో పుణ్యస్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి క్యూలైన్ లో బారులుతీరారు భక్తులకు అభిషేకం ఏర్పాటుచేసిన ప్రత్యేక ప్రత్యేక స్థలాలు అభిషేకాలు జరుగుతున్నాయి కార్యనిర్వాహణాధికారి ఆధ్వర్యంలో 20 మంది దేవాదాయ శాఖ సిబ్బంది సేవలందిస్తున్నారు 50 మంది పోలీసులు క్యూలైన్లు దర్శనాలు విధులు నిర్వహిస్తున్నారు

Conclusion:లక్ష్మణేశ్వరం లో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు
Last Updated : Mar 4, 2019, 7:31 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.