రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడానికి... 1320 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఎ.కె.మౌర్య తెలిపారు. ఈ పరీక్షలకు 4 లక్షల 95 వేల 526 మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్న ఎ.కె.మౌర్య... ఉదయం 9 నుంచి అరగంటపాటు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. అభ్యర్థి హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, చరవాణులు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.
నేడు పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు స్క్రీనింగ్ టెస్ట్
రాష్ట్రంలో ఇవాళ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు స్క్రీనింగ్ టెస్ట్ జరగనుంది. పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది.
పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు స్క్రీనింగ్ టెస్ట్
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడానికి... 1320 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఎ.కె.మౌర్య తెలిపారు. ఈ పరీక్షలకు 4 లక్షల 95 వేల 526 మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్న ఎ.కె.మౌర్య... ఉదయం 9 నుంచి అరగంటపాటు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. అభ్యర్థి హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, చరవాణులు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.
Reporter : j.sivakumar
Rayadurgam
Anantapuram (dist) ap
800 857 3082
వైభవంగా శ్రీ చిక్కనేశ్వర స్వామి రథోత్సవం
అనంతపురం జిల్లా కనేకల్ మండల కేంద్రంలో ప్రసిద్ధి చెందిన శ్రీ చిక్కనేశ్వర స్వామి రథోత్సవం శనివారం సాయంత్రం అశేష భక్త జన సందోహం నడుమ వైభవంగా జరిగింది ప్రతియేటా ఏప్రిల్ మాసంలో స్వామివారి రథోత్సవం జరుపుకుంటారు రథోత్సవం సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం భక్తులు మడుగు తేరులా గారు సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని రథంలో ప్రతిష్టించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు రుత్వికులు వేద మంత్రోచ్ఛరణల నడుమ శివనామస్మరణతో స్వామివారి భారీ రథాన్ని భక్తులు పురవీధుల గుండా ఊరేగించారు రథోత్సవంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజ రయ్యారు స్థానిక భక్తులతో పాటు ఉ ఆంధ్ర కర్ణాటక తెలంగాణ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు రథోత్సవం సందర్భంగా బంధువులు మిత్రులు భారీగా తరలిరావడంతో కణేకల్ పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది