సార్వత్రిక ఎన్నికలకు ఈసీ ఆమోదం తెలపడంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఎన్నికలలో మద్యం నియంత్రణపై చర్యలకు ఉపక్రమించింది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింనందున ఎక్సైజ్ అధికారులతో కమిషనర్ ఎం.కె.మీనా సమావేశం నిర్వహించారు.అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర సరిహద్దుల్లో ఇప్పటివరకు 31 చెక్పోస్టలు ఏర్పాటు చేశామన్నారు. వీటికి అదనంగా మరో 40 చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కోన్నారు. మద్యం విక్రయాలు ఎలా ఉండాలో ముందుగానే బేవరేజి సంస్థలకు సూచిస్తున్నారు. రహదారి వెంటనున్న భవనాలు, ఇళ్లలో తనీఖీలు చేపడుతున్నారు.
కమిషనర్ ఎం.కె.మీనా