పార్టీ వర్గాలు వెల్లడించిన ప్రకారం... మాజీ ప్రధాని దేవెగౌడ, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, డీఎంకే నాయకుడు స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో పాటు... యశ్వత్ సిన్హా, అరుణ్ శౌరి లాంటి ప్రముఖులు తెదేపా తరఫున ప్రచారానికి వస్తున్నారు. ఇప్పటికే వీరు హాజరయ్యే ప్రచార సభలు, ర్యాలీల తేదీలు ఖరారైనట్టు సమాచారం.
* కడప, ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలు నియోజకవర్గాల్లో తెదేపా అధినేత చంద్రబాబు మంగళవారం ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఆయన వెంట ఫరూక్ అబ్దుల్లా తెదేపా తరఫున ప్రచారం చేస్తారు.
* 28న విజయవాడలో తెదేపా ఎన్నికల ప్రచారానికి అరవింద్ కేజ్రీవాల్ హాజరవుతారు.
* 31న విశాఖలో మమత, కేజ్రీవాల్ తెదేపా ప్రచారానికి హాజరవుతారు.
* ఏప్రిల్ 2న నెల్లూరులో తేజస్వీ యాదవ్... తెదేపా తరఫున ప్రచారం చేస్తారు.
* అనంతపురం, కర్నూలు జిల్లాల్లో దేవెగౌడ.. తెదేపా ప్రచారానికి హాజరయ్యే అవకాశం ఉంది.
* తమిళనాడుకు సరిహద్దులోని చిత్తూరు జిల్లాలో స్టాలిన్ ప్రచారం చేసే అవకాశం ఉంది.
* శరద్ పవార్, యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ... వివిధ ప్రాంతాల్లో చంద్రబాబుతో కలిసి ప్రచారానికి హాజరు కానున్నారు.