ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహణలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని ఎమ్మెల్సీ జగదీశ్వరరావు ఆరోపించారు. ప్రభుత్వ నిర్సక్ష్యంతో ప్రతిభ కలిగిన విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌ను ఎందుకు ఆపారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
శాసనమండలిలో తాము ఇస్తున్న వాయిదా తార్మానాలను తిరస్కరిస్తున్నారని ఎమ్మెల్సీ శ్రీనివాసరావు ఆరోపించారు. ఎంసెట్ కౌన్సిలింగ్ ఎందుకు వాయిదా వేస్తున్నారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. కౌన్సిలింగ్ జాప్యంతో ప్రతిభ కలిగిన విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని తెలిపారు.
ఇదీ చదవండి... 'వ్యాపారవేత్తగా ఎక్కువకు అమ్ముకుంటారు... సీఎంగా బురద చల్లుతారా '