ETV Bharat / state

'కాలుష్య నివారణ మానిటరింగ్‌ సెల్ ఏర్పాటు చేయండి' - ngt

ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జాతీయ హరిత ట్రైబ్యునల్​ ముందు హాజరయ్యారు. రాష్ట్రంలో ఘన వ్యర్థాల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.

ఎల్వీ సుబ్రహ్మణ్యం
author img

By

Published : Apr 26, 2019, 3:19 PM IST

Updated : Apr 26, 2019, 4:56 PM IST

రాష్ట్రంలో పర్యావరణ కాలుష్య నియంత్రణ చర్యలు స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షించాలంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ సూచించింది. ఘనవ్యర్థాల నిర్వహణ నిబంధనల అమలులో రాష్ట్రాలు విఫలమయ్యాయని దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా శుక్రవారంలో ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎన్జీటీకి హాజరయ్యారు. రాష్ట్రంలో కాలుష్యం ప్రభావం, అక్రమ ఇసుక తవ్వకాలు వంటి అంశాలను సీఎస్ కు తెలిపిన జస్టిస్ గోయెల్ ధర్మాసనం.... పర్యావరణ కాలుష్యం పెనుముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కాలుష్య నివారణ చర్యలను మరింత తీవ్రతరం చేయాలని.. కృష్ణా నది పరిరక్షణపై దృష్టి సారించాలని సీఎస్ కు సూచనలు చేసింది. కాలుష్య నివారణకు మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి... కింది స్థాయిలో అధికారులను సమన్వయం చేయాలని జస్టిస్ గోయెల్ సూచించారు. కాలుష్యం ప్రభావం ఎక్కువ ఉన్న నగరాలను తొలిదశలో ఎంపిక చేసి ఘన వ్యర్థాల నివారణను చేపట్టాలని చెప్పింది. ఆరు నెలల్లో ఘన వ్యర్థాల నిర్వహణ, కాలుష్య నివారణ చర్యల్లో లక్షాలను చేరుకోవాలని సూచించింది. ఇప్పటికే అన్ని విభాగాల్లో కాలుష్య నివారణ చర్యలు చేపట్టామని.... ఎన్జీటీ ఆదేశాలతో వాటని మరింత ముందుకు తీసుకెళ్తామని సీఎస్ సుబ్రహ్మణ్యం ధర్మాసనానికి తెలిపారు. మరో ఆరు నెలల తర్వాత తిరిగి ఏపీలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్షిస్తామని ఎన్జీటీ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి

94వ వసంతంలోకి ఆంధ్ర విశ్వవిద్యాలయం

Intro:కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం టంగుటూరు లో భార్యను భర్త కత్తితో కొట్టి చంపిన సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన న ప్రసాద్ రెడ్డి అనే రైతు భార్య మల్లేశ్వరి ని కత్తితో కొట్టారు దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది ఈమెకు గత కొంతకాలంగా మానసికంగా బాగా లేకపోవడంతో తరచూ గొడవలు జరుగుతున్నట్లు నందివర్గం ఎస్సై హరి ప్రసాద్ వెల్లడించారు చిన్నపాటి గొడవ జరగడంతో కట్టెతో కొట్టడంతో ఊహించని విధంగా ఆమె మృతి చెందిందని ఈ మేరకు భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు రు

Body:బనగానపల్లి

Conclusion:మర్డర్
Last Updated : Apr 26, 2019, 4:56 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.