జన సైనికుల్లో తాను ఒక సైనికుడుగా మారడం ఎంతో ఆనందంగా ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు లక్ష్మీ నారాయణ జనసేన పార్టీలో చేరారు. పవన్ కల్యాణ్ ఆయనను సాదరంగా ఆహ్వానించారు. లక్ష్మీనారాయణతోపాటు ఎస్‌కేయూ మాజీ ఉపకులపతిరాజగోపాల్ జనసేనలో చేరారు. ఇద్దరికీ పార్లమెంటు స్థానంలో చోటు కల్పిస్తామని పవన్ హామీ ఇచ్చారు.
ఒక మార్పు కోసం పవన్ కల్యాణ్ సినీ జీవితాన్ని వదులుకుని వచ్చారని లక్ష్మీ నారాయణ అన్నారు. సమ సమాజం నిర్మించడంలో పవన్ కల్యాణ్‌తో కలిసి పని చేస్తానన్నారు.జనసేన పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోఅన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉందని లక్ష్మీ నారాయణ అన్నారు.
సున్నా బడ్జెట్‌తో ఎన్నికల్లో ఎలా పాల్గొనాలో చూపిస్తామన్నారు. జనసేనాని మార్గదర్శకంలో ముందుకెళ్దాం అని జన సైనికులకు పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి.