జగన్ పర్యటన..
నేడు తూర్పు గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రతిపక్షనేత, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండలో ఎన్నికల ప్రచారం చేస్తారు. ఉదయం 11.30 గంటలకు అనకాపల్లిలో... టెక్కలిలో మధ్యాహ్నం 2 గంటలకు సభలకు హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకు గాజువాకలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో జగన్ ప్రసంగిస్తారు.
పవన్ పర్యటన..
ఈ రోజు విశాఖ జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో పవన్ బహిరంగసభలో పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు పెందుర్తి జంక్షన్‌లో పవన్‌కల్యాణ్ బహిరంగసభలో ప్రసంగించనున్నారు. కొన్ని ప్రాంతాల్లో జనసేనకు మద్దతుగా.. పవనకల్యాణ్‌తో కలిసి సినీ నటుడు రామ్ చరణ్.. ఎన్నికల ప్రచారానికి హాజరుకానున్నారు.
ఇవీ చదవండి