రేపు ఉదయం సమావేశం కానున్న తొలి కేబినెట్లో ఎనిమిది అంశాలపై చర్చించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ సమావేశంలో పింఛన్లు రూ.2,250 పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఆశా వర్కర్ల జీతాలు రూ.10 వేలకు పెంపు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, మున్సిపల్ కార్మికుల జీతాల పెంపుపై చర్చ జరగనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతికి ఆమోదం తెలపనుంది. హోంగార్డుల జీతాల పెంపు, సీపీఎస్ విధానం రద్దుపై కేబినెట్లో చర్చ జరగనుంది. అక్టోబర్ నుంచి అమలుచేసే రైతు భరోసా పథకానికీ ఆమోదం లభించనుంది.
రేపే తొలి కేబినెట్ సమావేశం.. ఎనిమిది అంశాలపై చర్చ - జగన్
రేపు ఉదయం 10.30 నిమిషాలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. మెుదటి సారి సమావేశం కావడంతో ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. తొలి నుంచే హామీల అమలుపై దృష్టి సారించనున్నారు.