ETV Bharat / state

అమాత్య పదవులు.. అలా ఇస్తారన్నమాట! - వైకాపాట

ఎన్నికలు అయిపోయాయి...ఫలితాలు వచ్చేశాయి..సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఇప్పుడు చర్చంతా..మంత్రి పదవుల గురించే..ఎవరికి కేబినెట్​లో అవకాశం వస్తుందో అనే ఉత్కంఠ? ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ కొంతమందిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ మేరకు 7న వైకాపా శాసన సభాపక్షం సమావేశం...8న మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండనుంది.

అమాత్య పదవులు అలా..ఇస్తారన్నమాట!
author img

By

Published : Jun 2, 2019, 3:28 PM IST

Updated : Jun 2, 2019, 8:09 PM IST

జగన్​ కేబినెట్​​ కూర్పు

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్​... మంత్రి వర్గ కూర్పుపై దృష్టి సారించారు. ప్రాంతాలు, సామాజిక వర్గాలు, నేతల ప్రాముఖ్యత... తొలి నుంచి పార్టీకి అందించిన సేవలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేయనున్నారు. పలు జిల్లాల్లో మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయమై పార్టీ ముఖ్య నేతల అభిప్రాయం తీసుకుంటున్నారు జగన్​. అన్ని అంశాల్లోనూ సమతూల్యం ఉండేలా తుది జాబితాను రూపొందిస్తున్నారు.

7న భేటీ..

మంత్రి వర్గంపై తాను తీసుకున్న నిర్ణయాలను ముందుగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించాలని జగన్ నిర్ణయించారు. ఈనెల 7న వైకాపా శాసనసభా పక్ష సమావేశం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారు. పార్టీ నుంచి ఎంపికైన 151 ఎమ్మెల్యేల సహా ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. 67 మంది ఎమ్మెల్యేలు తొలిసారి శాసనసభలో అడుగు పెడుతున్నారు. సీఎం మినహా మిగిలిన 83 మందిలో చాలామంది రెండు సార్లు ఆ పైన ఎన్నికైన వారు ఉన్నారు. పార్టీలోని పలువురు ఎమ్మెల్సీలు సైతం అమాత్య పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. కష్టకాలంలో అండగా ఉన్న వారు.. జిల్లాల్లో ప్రజాదరణ కలిగిన ముఖ్యనేతలు తమకు అవకాశం కల్పించాలని జగన్ ను కోరుతున్నారు. ఇలాంటి వారు 50 మందికి పైగా ఉన్నారు.

జిల్లాకో మంత్రి పదవి

అధికారంలోకి రాగానే జిల్లాల పునర్​వ్యవస్థీకరణ...13 జిల్లాలను పార్లమెంటు స్థానానికి ఒక జిల్లా చొప్పున ఏర్పాటు చేస్తానని జగన్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. త్వరలో 25 జిల్లాలు కానున్నందున జిల్లాకో మంత్రి పదవి చొప్పున ప్రతి జిల్లాకూ ప్రాతినిథ్యం ఉండేలా మంత్రి వర్గాన్ని కూర్పు చేస్తున్నట్లు తెలిసింది. కొన్ని చోట్ల సమస్య లేనప్పటికీ కొన్ని పార్లమెంట్ స్థానాల్లో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది.

8వ తేదీనే ప్రమాణ స్వీకారం

సీఎం అభీష్టం మేరకే మంత్రి వర్గ సభ్యులను ఎంపిక చేసే అవకాశం ఉన్నా...తాను తీసుకున్న నిర్ణయాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించి వారి సమ్మతి తీసుకోవాలని జగన్​ భావిస్తున్నట్లు తెలిసింది. సమావేశం అనంతరం మంత్రి వర్గ సభ్యుల జాబితాను వెల్లడించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం 8వ తేదీన ఉదయం మంత్రి వర్గ సభ్యులతో గవర్నర్​ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Barrackpore (WB), Jun 02 (ANI): Bharatiya Janata Party (BJP) leader Arjun Singh said that the party will send 10 lakh postcards with 'Jai Shri Ram' written on it to West Bengal Chief Minister Mamata Banerjee. He said, "CM Mamata Banerjee arrested 10 people for chanting 'Jai Sri Ram', so now BJP will send 10 Lakh postcards with 'Jai Shri Ram' written on them, to her, let her arrest 10 lakh people. It seems she has lost her mental balance." At least 10 people were arrested on May 31 for chanting "Jai Shri Ram" slogans as Mamata Banerjee's convoy passed through Bhatpara area of North 24 Parganas district.
Last Updated : Jun 2, 2019, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.